కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానస పుత్రికః కేటీఆర్

480
Ktr Kaleshwaram
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లా గంభీ రావు పేట మండలం నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయంలో ప్రత్యేక పూజలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు సంబురాల వేడుకల్లో పాల్గోన్నారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరి త్యాగఫలం వల్ల ఎందరికి కలిగిందన్నారు. కాళేశ్వరం భూనిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని చెప్పారు. తెలంగాణను సశ్యశ్యామలం చేసే సంకల్పంతో గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు.

Ktr Kaleshwaram 2

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తీరనుందని చెప్పారు. భవిష్యత్‌లో వచ్చే నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరించి, మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేశారని అన్నారు. హైదరాబాద్ వంటి కోటి జనాభా ఉన్న పట్టణానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో త్రాగునీటి సమస్య ఉండదన్నారు . సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకి తీసుకెళ్లడం మామూలు విషయం కాదన్నారు .

ఈ ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 శాతం ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతుందన్నారు .ఆంధ్రా, మహారాష్ట్ర, ముఖ్యమంత్రులతో సఖ్యతతో ఉంటూ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చొరవ చూపుతున్నారని అన్నారు .
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, తెస్కాబ్ చైర్మన్ శ్రీ కొండూరి రవీందర్ , MLC శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , శాసన సభ్యులు శ్రీ CH రమేష్ బాబు , శ్రీ బాల్క సుమన్ పలువురు పాల్గోన్నారు.

- Advertisement -