రాష్ట్రంలో 97శాతం మేర సగటు వర్షపాతంః హైదరాబాద్ వాతావరణ కేంద్రం

303
Rain
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి 97శాతం మేర సగటు వర్షపాతం నమోదవుతుందని చెప్పారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి వై.కె రెడ్డి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్నారు. రాబోయే రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.

రైతులకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు 15రోజులు ఆలస్యంగా వచ్చాయన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ఫపిడనం ,దీని ప్రభావంతో మంచి వర్షాలు కురుస్తాయన్నారు. వచ్చే నెలలో సాధారణం కంటే అధికంగానే వర్షం కురుస్తుందని చెప్పారు.

- Advertisement -