RRR మూవీకి టైటిల్ చెప్పిన కేటీఆర్

325
ktr
- Advertisement -

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇటివలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తాజాగా రెండవ షెడ్యూన్ ను జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీని ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా..ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్రయూనిట్.

కొద్ది రోజుల క్రితం ఈసినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఈమూవీకి టైటిల్ మీరే చెప్పాలంటూ అభిమానులకు సవాల్ విసిరాడు దర్శకుడు రాజమౌళి. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న సాయంత్రం ఆస్క్ ఫర్ కేటీఆర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వింతగా సమాధానం చెప్పారు కేటీఆర్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు మీరు ఏ టైటిల్ ఇస్తారు అని అడగ్గా…. ‘రీజనల్ రింగ్ రోడ్’ అని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో కేటీఆర్ చెప్పిన ఆన్సర్ కు కాసేపు అందరూ నవ్వుకున్నారు.

- Advertisement -