ప్రశాంతంగా కొనసాగుతున్న నాలుగోదశ పోలింగ్

145
polling time

దేశ వ్యాప్తంగా నేడు నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. దేశవ్యాప్తంగా మొత్తం 71 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో మొత్తం 945 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మహారాష్ట్రలోని – 17, రాజస్థాన్ – 13, యూపీ – 13, పశ్చిమబెంగాల్‌లో – 8, మధ్యప్రదేశ్ – 6, ఒడిశా – 6, బీహార్‌ – 5, జార్ఖండ్‌ – 3 నియోజకవర్గాలతోపాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్‌ జరుగుతోంది.

నాలుగో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖలు పోటీ ఉన్నారు. ముంబైలోని వివిధ నియోజకవర్గాల నుంచి బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మతోంద్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతోపాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్‌, మూన్‌మూన్‌ సేన్‌, కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, సుభాష్‌ భామ్రే, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, బాబుల్‌ సుప్రియో తదితర ప్రముఖులు తమ భవితత్వాన్ని పరిక్షించుకోకున్నారు.