కాంగ్రెస్‌ నేతలను కోర్టుకు లాగుతాం- కేటీఆర్

380
KTR
- Advertisement -

ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే.. ఇంటర్మీడియట్‌ సమస్యను రావణకాష్టంలా రగలిస్తున్నాయని ధ్వజమెత్తారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో ‘మే డే’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడతూ..ఇంటర్‌ ఫలితాల్లో తలెత్తిన గందరగోళం తనను కూడా కలచివేసిందని కేటీఆర్‌ అన్నారు.

KTR

ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ఐటీ శాఖకు, ఇంటర్మీడియట్‌ బోర్డుకు సంబంధం ఉండదని తెలిపారు. ఇంటర్‌ ఫలితాల విషయంలో విపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయన్నారు. రూ.4 కోట్ల టెండర్‌కు రూ.10వేల కోట్లు ఎవరైనా లంచంగా ఇస్తారా? అని ప్రశ్నించారు.

ఇలాంటి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను అవసరమైతే కోర్టుకు లాగుతామన్నారు. విపక్షాలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇంటర్‌ ఫలితాల్లో పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మళ్లీ రీవెరిఫికేషన్ చేస్తోంది. కాబట్టి తొందరపడి ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు తీరని బాధను మిగుల్చవద్దు అని ఆయన కోరారు.

- Advertisement -