తెలంగాణలో ముందస్తు ఎన్నికల శంఖారావం మోగింది. ప్రగతిభవన్‌లో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం-గవర్నర్ అమోదించడం చకచక జరిగిపోయాయి. అనంతరం 105 స్ధానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్…రేపటి నుంచి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయిందన్నారు. ప్రజల మద్దతుతో తొలి ఇన్నింగ్స్ ఆహ్లాదకరంగా పూర్తయిందని ట్వీట్ చేశారు. రెండో ఇన్నింగ్స్ వైపు వెళ్తున్నాం…మీ మద్దతు,ప్రేమను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ కోరికమేరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
First innings in Govt done with 😊
With the blessings of people of Telangana, look forward to a fruitful second innings. We seek your support & love 🙏
— KTR (@KTRTRS) September 6, 2018