సోషల్‌ మీడియాని ఊపేస్తోన్న ‘నోటా’ ట్రైలర్‌..!

187
NOTA trailer

విజయ్‌ దేవరకొండ నెక్ట్స్‌ మూవీకోసం ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ‘గీత గోవిందం’తో సూపర్‌ హిట్‌ కొట్టిన విజయ్…ఇప్పుడు ‘నోటా’ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో క్యూరియాసిటి పెంచిన విజయ్‌..ఈ రోజు ట్రైలర్‌తో వచ్చేశాడు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా ట్రైలర్‌ ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. ఇందులో విజయ్ దేవరకొండ ఒక సాధారణ యువకుడిగాను .. యువ నాయకుడిగాను ఈ ట్రైలర్ లో కనిపించాడు. ఇక ‘నోటా’ ట్రైలర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తోంది. పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకిస్తోంది.

కాగా..ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాజర్ .. సత్యరాజ్ వంటి సీనియర్‌ నటులున్నారు.

NOTA OFFICIAL TRAILER - TELUGU | Vijay Deverakonda | Anand shankar