భాగ్యనగరానికి భద్రత కల్పించింది సీఎం కేసీఆర్..

55
jagadish reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఅర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగరానికి పూర్తిస్థాయిలో పతిష్టవంతమైన భద్రత కల్పించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వనస్థలిపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఖమ్మ సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు తరువాత ఆకతాయిల ఆగడాలపై నగర ప్రజలు ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన కోరారు.యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా షి టీం లు ఏర్పాటు చేసి పోకిరీలకు చెక్ పెట్టింది టిఆరఎస్ పాలనలోనే అన్నది ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.హైదరాబాద్ వ్యాప్తంగా సి సి కెమెరాలు ఏర్పాటు చేసింది కూడా టిఆర్‌ఎస్ పాలనలోనే అన్నది విస్మరించరాదని ఆయన కోరారు. తద్వారా నగరంలో శాంతిభద్రతల ను అదుపులోకి తెచ్చామన్నారు.అటువంటి టి ఆర్‌ఎస్ పార్టీకీ ఈ ఎన్నికల్లో చేయూతనందించి గెలుపుకు కృషి చేయాలని ఆ సంఘం ప్రతినిదులను మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్దించారు.