జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొడతాం : కేకే

50
kk

కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల విజయాలు కొత్త కాదన్నారు టీఆర్ఎస్ ఎంపీ, సెక్రటరీ జనరల్ కే కేశవరావు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో కేకే ప్రసంగించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించి ఒక్కసీటులో సెంచరీ మిస్ అయిందని ఇప్పటి ఎన్నికల్లో మాత్రం తప్పకుండా వందకు పైగా సీట్లు సాధించిన సెంచరీ పూర్తి చేస్తామని కేకే అన్నారు. మనం అభివృద్ధిని కోరుకుంటుంటే, ఇతర పార్టీలు మాత్రం ప్రజల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాయని కేకే అన్నారు.