నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్టీ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా బీసీ సంఘాలతో పాటు పార్టీ క్యాడర్ మొత్తం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఇక మంత్రులు తలసాని,మహమూద్ అలీ,జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మానిటరింగ్ చేస్తూ ముందుకు సాగుతుండగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ప్రచారానికి రానున్నారు.
2 రోజుల పాటు మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఉండనుండగా ఎన్నికలు ముగిసే వరకు నియోజకవర్గంలోనే ఉండాలని మంత్రి తలసానికి సూచించారు గులాబీ బాస్. ఈ నెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండనుండగా ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై త్వరలో ప్రకటించనున్నారు పార్టీ నేతలు.
ఇక సాగర్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను బుజ్జగించారు నేతలు. మరోవైపు కడారి అంజయ్య టీఆర్ఎస్‌లో చేరడం మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామగ్రామాన ప్రచారం చేస్తుండటంతో భగత్ గెలుపుపై ధీమాతో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు.