నయన్‌తో ఉదయనిధికి ఎఫైర్‌..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

159
stalin
- Advertisement -

తమిళనాట ఎన్నికల సంగ్రామంలో షాకింగ్స్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత, సినీ నటుడు రాధారవి. చెపాక్ నుండి బరిలో ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ నయనతారతో ఉదయనిధికి ఎఫైర్ ఉందని..ఈ విషయం మాట్లాడినందుకే తనను డీఎంకే నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని, అయినా అలాంటివి తాను పట్టించుకోనని స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.

రెండేళ్ల కిందట ఓ ఆడియో లాంచ్‌లో హీరోయిన్ నయనతారపై వ్యాఖ్యలు చేసి డీఎంకే నుంచి సస్పెండైన రాధారవి.. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. కొద్ది నెలల కిందట ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రాధారవి ఓ కార్యక్రమంలో మరోసారి నయనతార-ఉదయనిధి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. నయనతారకి డీఎంకేకి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు.

అలాగే కమల్‌కి చురకలంటించారు రాధారవి. మోడీ దేశాన్ని కాపాడితే.. కమల్ కట్టుకున్న భార్యలను కూడా కాపాడుకోలేదని మండిపడ్డారు. ముగ్గురు మహిళ జీవితాలను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. రాధారవి చేసిన వ్యాఖ్యలు తమిళనాటు పొలిటికల్ హీట్ పెంచేశాయి.

- Advertisement -