సాగర్ ఉప ఎన్నిక.. 17 మంది నామినేషన్లు తిరస్కరణ

167
kankanala
- Advertisement -

నాగార్జున సాగర్ ఎన్నికల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బీజేపీ అసంతృప్త నేత నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఏప్రిల్ 3 వరకు నామినేషన్స్ ఉపసంహరణకు గడువు విధించగా రు. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుండగా…మే 2న కౌంటింగ్ జరుగనుంది. 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా కరోనా నేపథ్యంలో 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రం, గతంలో కంటే 53 పోలింగ్ కేంద్రాలు పెంచినట్లు వివరించారు. ఏప్రిల్ 17న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ ఉంటుందన్నారు.

టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ బరిలో ఉండగా ప్రధానంగా టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా నాగార్జున‌సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

- Advertisement -