టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్ షురూ..

47

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రతిపాదిస్తూ ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రుల తరఫున మంత్రి మహమూద్ అలీ, ఎంపీల తరఫున కేకే, ఎమ్మెల్యేలు తరపున లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గం తరపున తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీల తరఫున భాను ప్రకాష్ రావు ప్రతిపాదించారు. మిగతా వారంతా బలపరిచారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.