గులాబీ గూటికి చేరుతున్న హుజురాబాద్ యువత..

62

హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణ ఎలక్ట్రిషన్ మరియు ‌ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ‌సంక్షేమ‌‌ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు. వారికి మంత్రి కొప్పుల పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

తామంతా టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటేసి గెలిపిస్తామని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సంఘ నాయకులు కండె‌ సురేష్, కండె శ్రీకాంత్ తెలిపారు. అనంతరం వారి సమస్యలను మంత్రికి విన్నవించుకోగా వారు సానుకూలంగా స్పందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.