మొక్కలు నాటిన టీఆర్ఎస్‌ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ జగన్‌..

123
green

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు టి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పీటముడి జగన్. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ తన జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసి , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విసిరారని అందులో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటానని వెల్లడించారు జగన్‌.

కేటీఆర్ ఆశీస్సులతో తన సోషల్ మీడియా లో ఉన్నత స్థాయికి వచ్చానని తెలియజేశారు .సోషల్ మీడియా ప్రతినిధులందరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యులై మొక్కలు నాటి , వాటిని ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజవంతం చేయాలని కోరారు.