చలో వనపర్తి..ప్రజా ఆశీర్వాద సభ

290
trs
- Advertisement -

వనపర్తి ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్దమైంది. నగవరంలో దాదాపు 100 ఎకరాల్లో బహిరంగసభను నిర్వహించనున్నారు. దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలను తరలించేలా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలమూరు చరిత్రలో వనపర్తి సభ నిలిచిపోతుందని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.

సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 600 ఎకరాలు కేటాయించారు. బహిరంగ సభ మైదానం పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. వారం రోజులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.

నిజామాబాద్‌లో, నల్లగొండలో ప్రజాఆశీర్వాద సభలు విజయవంతంగా జరగడంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను సభకు వచ్చేలా సమాయత్తం చేశారు. సభ భద్రతా చర్యలపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర పలుమార్లు పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరి, అపూర్వరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

- Advertisement -