ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది కేంద్రం. బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది టీఆర్ఎస్.
తెలంగాణలో పండిన వరిధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే.. కేంద్ర బీజేపీ సర్కారు రైతులను, ప్రజలను అవమానించిందని, బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ యాక్షన్‌ప్లాన్ ప్రకటించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు :
() 4 ఏప్రిల్, 2022 – మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
() 6 ఏప్రిల్, 2022 – జాతీయ రహదారులపై రాస్తారోకో
(నాగ్‌పూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై)
() 7 ఏప్రిల్, 2022 – జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు
() 8 ఏప్రిల్, 2022 – గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు మరియు ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు
() 11 ఏప్రిల్, 2022 – ఢిల్లీలో నిరసన దీక్ష