సాగరహారంలో మీరు ఎక్కడ ఉన్నారు :మంత్రి కేటీఆర్‌

69
- Advertisement -

తెలంగాణ మలి దశ ఉద్యమంలో మీరెక్కడ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతిపక్షాలకు సూటి ప్రశ్న వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారానికి నేటితో పదేండ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈసందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భంగా లక్షల గొంతుకలు జై తెలంగాణ అని నినదించిన రోజు అని కేటీఆర్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి రోజు పనికిమాలిన విమర్శలు చేస్తున్న రేవంత్‌, బండి సంజయ్‌, ప్రవీణ్‌ కుమార్‌, షర్మిలకు కేటీఆర్‌ సూటి ప్రశ్న వేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాగరహారంలో మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2013 సెప్టెంబర్‌30 నాటి సాగరహారంలో భాగంగా తీసిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు.

- Advertisement -