దసరా కానుకగా ది ఘోస్ట్‌…ట్రైలర్‌ రిలీజ్‌

102
- Advertisement -

అక్కినేని యువ సామ్రాట్‌ నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ది ఘోస్ట్‌. దసరా కానుకగా అక్టోబరు 5నప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ను కూడా అభిమానులతో పంచుకుంది.

ది ఘోస్ట్‌లో నాగార్జున ఇంట‌ర్‌పోల్ ఆఫిస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ నిర్మించారు.

- Advertisement -