తాజగా టీ న్యూస్ మరియు నమస్తే తెలంగాణ సంయుక్తంగా కలిసి తెలంగాణలో సర్వే నిర్వహించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేది వరకూ ఈసర్వేను నిర్వహించినట్టు తెలిపారు. 50శాతం మంది పురుషులు, 50శాతం మంది మహిళలు, రైతులు, పలు కులాలకు సంబంధించిన వారి వద్ద నుంచి ఈసర్వే చేసినట్టు స్పష్టం చేశారు. ఈసర్వేలో లక్షకు పైగా మంది ఓటర్ల నాడీని తెలుసుకున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఈసర్వేలో తేలింది.
అత్యధిక స్ధానాలు టీఆర్ఎస్ గెలుచుకోబుతున్నట్లు ఈసర్వే చెబుతోంది. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా టీఆర్ఎస్ 98 నుంచి 108 స్ధానాలు గెలవబోతున్నట్లు ఈసర్వేలో తేలింది. ఇక కూటమికి 02 నుంచి 08 సీట్ల వరకే పరిమితం కానుంది. ఇక ఎంఐఎం ఇంతకుముందు ఉన్న 07 సీట్లలో గెలవనుంది. ఇక బీజేపీ 1 లేదా 02 సీట్లలో గెలవనుంది సర్వే తెలిపింది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ ఈఎన్నికల్లో సెంచరీ కొట్టనుందని తెలస్తుంది.