ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరు మార్పు..

529
delhi capitalls
- Advertisement -

.ఐపిఎల్ లో ఢిల్లీ టీం పేరు మార్చుకుంది. తాజాగా టీం అధినేత‌లు కొత్త లోగోను కూడా విడుద‌ల చేశారు. ఇక నుంచి ఢిల్లీ డేర్ డెవిల్స్ కాకుండా ఢిల్లీ క్యాపిట‌ల్ గా పిల‌వాల‌ని తెలిపింది. ఢిల్లీ జ‌ట్టును GMR గ్రూప్ 2009లో కొనుగోలు చేసింది. అన్ని దేశాల‌కు సంబంధించిన మంచి మంచి ఆట‌గాళ్లు ఈటీంలో ఉన్నా క‌నీసం సీజ‌న్ లో ఒక 5మ్యాచ్ లు కూడా గెల‌వ‌లేక‌పోతున్నారు. ఓ సీజన్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. గతేడాది సీజన్‌లో తొలి 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించింది.

delhi

2019 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం డిసెంబర్ 18వ తేదీన జైపూర్ లో ప్రారంభం అవుతుందని బీసీసీఐ ప్రకటించింది. తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది. ఢిల్లీ క్యాపిట‌ల్ టీంలో కొత్త మార్సులు ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. ఇన్నాళ్లు జట్టుకి కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న గంభీర్ తప్పుకోవటంతో.. ఆ స్థానంలో సన్ రైజర్స్ నుంచి శిఖర్ థావన్ ను తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. మ‌హ్మ‌ద్ కైఫ్ కోచ్ గా నియ‌మించారు. భారీ మార్పులతో టీం మరింత స్ట్రాంగ్ అయ్యిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ కిరణ్ గాంధీ అనౌన్స్ చేశారు

- Advertisement -