కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం- మంత్రి

19
Minister Gangula Kamalakar

కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గురువారం 29వ డివిజన్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుండి పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ నాయకుడు చెల్లోజు శ్రీనివాస్ మరియు కార్యకర్తలకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 30వ డివిజన్‌లో కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు వేగంగా సాగుతున్నాయన్నారు. పార్టీ కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతోనే రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకూ నీరు అందుతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు అధినాయకత్వం ఢీల్లీలో ఉంటుందని, కాని తమ పార్టీ అధినాయకత్వం ఇక్కడి ప్రజలేనన్నారు.