అజహరుద్దీన్‌తో కలిసి బ్యాటింగ్ చేసిన హరీష్‌.. ఫొటోలు వైరల్‌

40
Minister Harish rao

ఇటీవల సిద్ధిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పోటీలను మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. అయితే ఈ టోర్నమెంట్ భాగంగా బుధవారం ఫైనల్స్‌ జరిగాయి. ఈ ఫైనల్‌ మ్యచ్‌కి ముఖ్యఅతిథిగా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌,మంత్రి హరీష్‌ రావు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా అజహరుద్దీన్‌తో కలిసి మంత్రి హరీష్‌ బ్యాటింగ్ చేశారు. అజర్ ఓ ఎండ్‌లో బ్యాటింగ్ చేయగా, హరీష్‌ రావు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేశారు. అంతేకాదు, తన బౌలింగ్ పాటవాన్ని కూడా హరీష్‌ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి హరీష్‌ రావు స్వయంగా పంచుకున్నారు. వీటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.