ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

125

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఒక రోజున నమోదైన కేసుల సంఖ్య 30కి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 67 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 17 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇదే సమయంలో 54 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,077కి పెరిగింది. ఇప్పటి వరకు 8,81,292 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 7,166 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 619 యాక్టివ్ కేసులు ఉన్నాయి.