- Advertisement -
వరి కొనుగోళ్లపై ప్రధానికి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖరాస్తాం. వరి ధాన్యం కొనుగోళ్లపై సరైన స్పష్టత ఇవ్వాలని కోరుతామన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో ధాన్యం కొన్నట్టుగా.. తెలంగాణలో కొంటారా లేదా? చెప్పాలి. కేంద్రం వైఖరిపై ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేస్తామన్నారు. ధర్నా అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తాం. అప్పటికీ స్పష్టత రాకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం. నల్ల చట్టాలపై అసెంబ్లీలో కచ్చితంగా తీర్మానం చేస్తాం.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగుతుందన్నారు సీఎం.
- Advertisement -