- Advertisement -
హుజుర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం కనబరుస్తూ సత్తాను చాటుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్‌లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్‌లో 6,777 ఓట్ల ఆధిక్యంతో సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు.
తొలి రౌండ్ పూర్తయ్యే సరికి సైదిరెడ్డికి 5,583 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డికి 3,107 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 128, టీడీపీకి 113 ఓట్లు వచ్చాయి. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది ఫలితం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య వెలువడనుంది.
- Advertisement -