దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. మొదటి విడత ఎప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కు అంత పెద్దగా పోటీ లేకపోవడంతో..ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రసవత్తర పోటీ నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయం అంటున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా ఎపీలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీకి సిద్దమన్నారు.
రాజధాని ప్రాంతంమైన విజయవాడ సెంట్రల్ నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. అంతేకాకుండా ఇవాళ ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడానికి హైదరాబాద్ కు బయల్దేరారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గిప్ట్ గా ఇస్తానని చెప్పారు. ఒకవేళ ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేస్తే గనుక పోటి గట్టిగాను ఉండనుందంటున్నారు విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో ఇప్పట్లో టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. ఏపీలో తాను టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానన్న నిర్ణయంపై టీఆర్ఎస్ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.