స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్దులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్

269
Kcr
- Advertisement -

స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్దుల పేర్లను ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. వరంగల్ జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి పార్టీ సినియర్ నేత తేరా చిన్నపరెడ్డి పేర్లను ఖరారు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ ఉప ఎన్నికలకు మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడవు ఉంటుంది. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు.

- Advertisement -