ఆనందం తట్టుకోలేక కాలర్ ఏగరేసిన మహేశ్ బాబు

136
Mahesh babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈచిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్గా నటించగా…అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. మహర్షి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ బాబు. తాజాగా ఈమూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించారు.

ఈసందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఆడియో ఫంక్షన్లో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తానని చెప్పారని గుర్తుచేవారు. సినిమా చూశాక నా అభిమానులు నిజంగానే కాలర్ ఎగరేశారు. ఇప్పుడిక నా వంతు వచ్చింది అంటూ స్టేజి మీద తన చొక్కా కాలర్ పైకి లేపారు. తన హిట్ సినిమాల్లో మహర్షి నాకు గొప్ప సినిమా నిలుస్తుందని అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఈసినిమాను తల్లులందిరికి అంకితం చేస్తున్నానని చెప్పారు.