కోటివృక్షార్చనలో పాల్గొన్న ఎన్నారై టీఆర్‌ఎస్..

38
TRS NRI Cell-Oman

ఒమాన్ దేశం మస్కట్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అట్టహసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఒమాన్‌లో కూడా మొక్కలు నాటి వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అనతి కాలంలో రాష్ట్రం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రపంచ వ్యాప్తంగా మనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మన ప్రజల అదృష్టం అని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టి ఆలోచనతో రాష్ట్రం సస్యశ్యామలంగా, దేశంలోనే వ్యవసాయంలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు.

సంతోష్ కుమార్ నిర్వహిస్తున కోటివృక్షార్చన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమలు విశ్వవ్యాప్తంగా విస్తృతంగా విస్తరించి ప్రత్యేక గుర్తిపు పొంది వివిధ దేశాలకు పర్యావరణ మీద ప్రత్యేక దృష్టి సారించే విధంగా చేసాయని తెలిపారు. ఇక కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పరిమితి సంఖ్యతో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, వీరేందర్, అజయ్,లక్ష్మణ్ మరియు జాగృతి నాయకులు మమత,సుజన తదితరులు పాల్గొన్నారు.