సీఎం కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నారైలు నామినేషన్..

152
trs
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నారైల తరపున నామినేషన్ వేశారు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేతగా మళ్లీ కేసీఆరే ఉండాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలు కార్యకర్తలు నినదిస్తున్నారు. పార్టీ నియమావళిని అనుసరించి నాలుగేండ్లకోసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు పేరును ప్రతిపాదిస్తూ తెరాస ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వివిధ దేశాల ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి రిటర్నింగ్‌ అధికారి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు.

అందరూ ఎన్నారైలు తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ నుంచి ఆ శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల మరియు హరీష్ రంగ, సౌజన్ రావు, శివ రెడ్డి నల్ల, సాయి కిరణ్ వేముల, ఉపేందర్, యూకే శాఖ నుంచి రాజ్ కుమార్ షానబోయిన, రత్నాకర్ కడుదుల, రమేష్ ఎస్సంపల్లి, శ్రీనివాస్ వల్లల,మల్లేష్ పప్పు, తాటికుంట వేణుగోపాల్, ప్రవీణ్ పంతులు, సుభాష్ కోరుపల్లి, తాటికుంట జనార్దన్ రెడ్డి, మాల్దీవుల శాఖ నుంచి అధ్యక్షుడు రాకేశ్. కువైట్ నుంచి అధ్యక్షురాలు అభిలాష గొడిసాలా, ఇటలీ శాఖ నుంచి వినయ్, ఆస్ట్రియా శాఖ నుంచి అధ్యక్షులు వివేక్ , ఫిన్లాండ్ శాఖ నుంచి అధ్యక్షులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -