హరిహర వీరమల్లు..క్రేజీ అప్‌డేట్

160
pawan-kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ మొగల్ పాలనా కాలం నాటి కథాకథనాలతో రాబోతుంది. ఇందులో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది.

కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడగా తాజాగా ఈ నెల 25 నుండి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను నిర్మించి, హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపారు దర్శకుడు క్రిష్.

ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -