నాలుగోరోజు టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన..

134
kpr
- Advertisement -

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నాలుగోరోజు టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీస్తోంది టిఆర్ఎస్ పార్టీ. నిన్న రోజంతా సభలో ఆందోళన నిర్వహించారు టిఆర్ఎస్ ఎంపీలు. టిఆర్ఎస్ ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది.

రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. రాజ్యసభ లోనూ సభా కార్యకలాపాలను స్తంభింప చేశారు టిఆర్ఎస్ ఎంపీలు. పోడియం చుట్టుముట్టి రైతులను కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు రైతుల పక్షాన పార్లమెంట్ లో పోరాటం కొనసాగుతుందని టిఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.

- Advertisement -