మూడోరోజు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన..

136
trs mps
- Advertisement -

మూడో రోజు పార్లమెంట్లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిరసిస్తూ లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నిరసన తెలపగా ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది.

ఆకుప‌చ్చ కండువాలు ధ‌రించి ఎంపీలు నిరసన తెలపగా వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ఇక రాజ్యసభ లోనూ టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియం వద్ద ఫ్ల కార్డులతో నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభణు 12 గంటలకు వాయిదా వేశారు.

- Advertisement -