ధాన్యం కొనుగోలుపై స్పష్టత వచ్చేవరకు పోరాటం చేస్తాం..

32
santhosh

ధాన్యం కొనుగోలు పై పార్లమెంట్ లో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చే వరకు మా ఆందోళన కొనసాగుతోందని తెలిపారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కేశవరావు. పార్లమెంటు వేదికగా ధాన్యం కొనుగోళ్లపై గందరగోళానికి తెరపడాలన్నారు.

మేము ప్రతిపక్షంతో ఉన్నాం…12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు 12 మంది రాజ్యసభ సభ్యల సస్పెన్షన్ పై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ఆందోళన కొనసాగుతోంది.

విపక్షాలకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు టిఆర్ఎస్ ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి.