- Advertisement -
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలో ఆందోళన కొనసాగుతూనే ఉంది. న్యూఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో గల గాంధీ విగ్రహం వద్ద ఇవాళ కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేశారు. గత అయిదు రోజుల నుంచి లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
- Advertisement -