ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన..

109
trs
- Advertisement -

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ రెండోరోజు లోక్ సభలో నిరసన చేపట్టారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.

ఆకుప‌చ్చ కండువాలు ధ‌రించిన టీఆర్ఎస్ ఎంపీలు.. వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టీఆర్ఎస్ స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

- Advertisement -