కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు..

177
trs MPs
- Advertisement -

బుధవారం టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఎంపీలు బండ ప్రకాశ్, రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత ఉన్నారు. కిషన్‌ రెడ్డిని కలిసిన ఎంపీల బృందం.. రామప్పకు యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పర్యాటక అభివృద్ధిపై చర్చించారు.

రామప్ప ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కోసం రూ.250 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే భద్రాచలం దేవాలయాన్ని ప్రసాద్ స్కీమ్‌లో చేర్చాలని వినతి పత్రం మంత్రికి అందజేశారు. తెలంగాణలోని ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని..సమ్మక-సారక్క జాతరను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఎంపీల బృందం విజ్ఞప్తి చేశారు.

- Advertisement -