అందులకు అండగా ఎంపీ సంతోష్‌..

52
mp santhosh

ఈ రోజు హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ సంతోష్‌ అందులకు రగ్గులను బహుకరించారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. మా గౌరవనీయ సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు అని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ వరంగల్, వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మైన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.