టీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు..

102
MLA Shankar Naik

మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమం పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం భేషజాలకు పోకుండా కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని గుర్తు చేశారు.

కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తక్షణ కర్తవ్యంగా పెట్టుకోవాలని సూచించారు. మున్సిపల్ మంత్రి కేటిఆర్ మహబూబాబాద్ అభివృద్ధికై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్, నాయిని రంజిత్ మరియు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.