భార్య కథతో దిల్ రాజు నెక్ట్ప్‌ మూవీ..!

47
dil raju

సినీ పరిశ్రమ కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఓటీటీకి అనుగుణంగా కథలను తయారు చేసుకుంటూ, తక్కువ ఖర్చుతో వినూత్న ఆలోచనలతో సినిమాలు తీసి హిట్లు కొడుతున్న వేళ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఓటీటీ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తగిన కథల కోసం వెతుకుతుంటే, ఆయన భార్య తేజస్విని చెప్పిన స్టోరీ ఆయనకు బాగా నచ్చిందట.

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన తేజస్విని కొత్త కథలపై దృష్టిసారించారట.. ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ స్టోరీని తన భర్తకు వినిపించగా… రాజుకు నచ్చడంతో ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తాజా సమాచారం. కథ ఫైనల్ అవుట్ పుట్ బాగుంటే.. ఈ కథనే ఓ వెబ్ సీరిస్‌గా తీయనున్నారని టాక్ నడుస్తోంది.

ఇక దిల్‌రాజు ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ఎఫ్‌3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పింక్ రీమేక్ వకీల్ సాబ్‌ను నిర్మిస్తున్నాడు.