టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ప్రజా సమస్యలపై అలాగే ప్రజలకు ఆవగాహన కల్పించే ఎన్నో విషయాలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకుంటారు. గత కొంతకాలంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్నారు. కాగా ఇటీవల దేశాన్ని కరోనా కభళిస్తున్న నేపథ్యంలో మహమ్మారి గురించి ట్విట్టర్ వేదికగా ప్రజలకు ఎంతో అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలను ఎంపీ సంతోష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు.
ఇక తాజాగా ఎంపీ సంతోస్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ వృద్దురాలు సీఎం కేసీఆర్‌పై అమెకున్న అభిమానాన్ని చాటుకుంది. కేసీఆర్ గారి మాట వేద వాక్కు.. ఆయన ద్వారా అమ్మవారు పలికినట్లు ఉంది.. ఆయన పాలన ఒక మంచి మహారాజు పాలన లా ఉంది.. ఆయన చెప్పినట్లు వింటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.. అంటు ఆ పెద్దమ్మ మనసులో మాటను చెప్పింది.. ఈ విధంగా ఆ వృద్దురాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించిరంది. దీని సంబంధించిన వీడియోను ఎంపీ సంతోష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Words like these help us believe we are treading the right path & we will overcome this together.
Hearing such kind words abt someone i consider my God is overwhelming.
Her keen observation & judicious understanding abt the prevailing situation is amazing.#StayHome #SaveLives pic.twitter.com/W2YVMBkSym
— Santosh Kumar J (@MPsantoshtrs) April 8, 2020