రైతులు ఇబ్బంది పడొద్దు ప్రతి గింజా కొంటాం..

311
palla rajeshwar reddy

ఈరోజు మొక్కజొన్న, వరీ ధాన్యం సేకరణలో వచ్చే సమస్యలపై సత్వర పరిస్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని రైతు బంధు సమితి చైర్మన్ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌లో 5 డిపార్ట్మెంట్‌లతో కంట్రోల్ రూమ్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం రైతులు ఏమైనా సమస్యలు వస్తే మాకు పోన్ చెయ్యాలని చెప్పాము. దీనితో మాకు రోజు 100 మంది రైతులు పోన్ చేస్తున్నారు వారి సమస్యలపై ఎప్పటికప్పుడు పరిస్కారం చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ పంట వచ్చింది.. రైతులకు సంబంధించిన హార్వెస్టార్‌లు ఇబ్బందులు వస్తాయి అని చెప్పారు. దానికి సంబంధించిన సమస్య పై ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 1500 హార్వెస్టార్‌లు కావాలి చెప్పారు. కాబట్టి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి మన రాష్ట్రంలోని 32 జిల్లాలకు పంపించడం జరిగింది. మన దగ్గర కూడా ఇప్పటికే హార్వెస్టార్‌లు ఉన్నాయి.

గతంలో కంటే చాలా పంట దిగుబడి పెరిగింది, 39 లక్షల ఎకరాల్లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం రానుంది. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 32 వేల కోట్లను బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు. కరోన వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించాలి. రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం ప్రతి పైసా చెల్లిస్తాం. కరోన వ్యాధిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తున్నారు. మీరు ఇబ్బందులు పడవద్దు అని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

8 కోట్ల గన్ని బ్యాగ్ లు అందుబాటులో ఉన్నాయి ఇవి 50 శాతం కొనుగోలు కు సరిపోతుంది. అయితే ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వంను కొరినం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకారం 60 శాతం కొత్తవి, 40 శాతం పాతవి వాడుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి మన దగ్గర పాత గన్ని బ్యాగ్‌లు ఉన్నాయి, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాన మంత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో కూడా మాట్లాడారు. నెల రోజుల కొనుగోలకు ఇప్పటివరకు మన దగ్గర ఉన్న గన్ని బ్యాగ్‌లు సరిపోతాయి. టార్పాలిన్ కవర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కోసం 7000 కేంద్రాలను ఏర్పాటు చేశాం. 20 కోట్ల గన్ని బ్యాగ్ లు అవసరం.మన దగ్గర 10 కోట్ల బ్యాగ్ లు ఉన్నాయి. అంతేకాదు మన దగ్గర ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని సడలింపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది.హమాలి వాళ్ళ సమస్య కూడా త్వరలో పరిస్కారం అవుతాయి. ఎవరు రైతులు ఇబ్బంది పడవద్దు ప్రతి గింజా కొంటాం ప్రతి పైసా చెల్లిస్తాం. ధాన్యం సేకరణ సమస్యలపై కంట్రోల్ కాల్ సెంటర్ నెంబర్ 7288894807,7288876545 సంప్రదించవచ్చు.