బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నాం- ఎంపీ రంజిత్ రెడ్డి

797
TRS MP Ranjith Reddy
- Advertisement -

నేడు జరిగిన బడ్జెట్ సమావేశంలో తెలంగాణ కోరుకున్న అంశాలను కేంద్రం పట్టించుకోలేదని, కేంద్ర బడ్జెట్‌లో వాటి గురించి ప్రస్తావించలేదని టీఆర్ఎస్ ఎంపీలు పెదవి విరిచారు. ఢిల్లీ మీడియాతో మాట్లాడిన టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి దేశానికి తెలంగాణ సంపద సృష్టిస్తుందని కేంద్రం చెప్పకనే చెప్పింది. అన్ని రంగాల వారిగా తెలంగాణ వృద్ధి రేటులో ముందుందని.. కేంద్ర ఆర్ధిక మందగమనం నుంచి ఏవిధంగా బయటపడాలో ఆలోచన చేయడం లేదు. పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని ఎంపీ ఎద్దేవ చేశారు.

5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే చాల డబ్బు కావాలి. కేంద్ర లెక్కల గారడి చేస్తున్నారు.పథకాల అమలులో తెలంగాణ ముందుంది. అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏవిధంగా సాధ్యమని.. ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -