ఎన్ని ఇబ్బందులు వచ్చిన కేసీఆర్ వెంటే ఉంటా- ఎంపీ నామా

190
mp nama
- Advertisement -

నా గురించి ప్రజలందరికీ తెలుసు నేను నీతి నిజాయితీతో ఉంటాను. ప్రజలకు సేవ చేసేందుకు రాజ్యాంగ వ్యవస్థ అనే బాటలో ముందుకు వెళ్తున్నాను అని లోక్ సభ టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మా నాయకుడు కేసీఆర్ బాటలో నేను నడుస్తా.. నా బలం కేసీఆర్- నా బలగం ఖమ్మం ప్రజలు.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కేసీఆర్ వెంటనే నడుస్తా.. ఉంటా అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. 40 ఏళ్ల క్రితం మధుకాన్ సంస్థను నేను స్థాపించాను. వాజ్ పాయ్ హయాంలో గోల్డెన్ క్వాటరీ ఈ సంస్థలు పూర్తీ చేసాయి. చైనా బోర్డర్‌లో మధుకాన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆ కంపెనీల్లో నేను డైరెక్టర్‌గా లేను- మా తమ్ముళ్లు చూస్తున్నారని నామా స్పష్టం చేశారు. 2011లో రాంచీ ఎక్స్ప్రెస్ వే 160కిలోమీటర్ల ప్రాజెక్టుతో మొదలైంది. 16వందల కోట్ల ప్రాజెక్టులో 460 కోట్లు కంపెనీ ఇవ్వాలి. మిగతా అమౌంట్ బ్యాంక్ లు ఇవ్వాలి. బ్యాంకు ప్రాజెక్టు మీద 652 కోట్లు మాత్రమే పెట్టింది. వడ్డిగా 378 కోట్లు తీసుకుంది. అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో ప్రాజెక్టు రద్దు చేసామని తెలిపారు.

టర్మీనెట్ చేసే సమయానికి 60శాతానికి పైగా ప్రాజెక్టు వర్క్ అయింది. ఎస్క్రు అకౌంట్ కు వందశాతం పవర్ బ్యాంక్ కు మాత్రమే ఉంది- కంపెనీకి లేదు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం మేము పనిచేసాము. కంపెనీకి జరిగిన అన్యాయానికి అర్పితేజన్ ట్రిబ్యునల్ కు వెళ్ళింది. ప్రాజెక్టుపై మూడు కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. బీహార్ లో చెట్లు కొట్టి వేస్తున్నారు అని 2014లో పిల్ వేశారు. దేశవ్యాప్తంగా బిఓటి ప్రాజెక్టు నిబంధనలు కేంద్రం మార్పులు చేసిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పూర్తిగా మేము సహకరిస్తాం. రాజ్యాంగం- ట్రిబ్యునల్ పై పూర్తి నమ్మకం వుంది. మొదటి నుంచి కంపెనీలో నేను లేను అని నామా పేర్కొన్నారు.

- Advertisement -