మేము ఎప్పుడు రైతులతోనే-కేకే

296
kk
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లును రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభను రేపటికి డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే. కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ 12 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవంలో ఎప్పుడు జరగని రీతిలో నిబంధనలను అతిక్రమించడం, మాట్లాడే హక్కును అన్నింటినీ కాలరాశారు. రైతుల బిల్లులలో ప్రతి క్లాజ్, సబ్ క్లాజ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.

సభలో చర్చ అంత బాగానే జరిగింది.. కానీ ఓటింగ్ సమయం వచ్చేసరికి పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వం ఒక పక్కకు వచ్చి డిప్యూటీ చైర్మన్‌ను ఇన్‌ప్లుయన్స్ చేసి బిల్లులను ఆమోదించారు. బిల్లులను రిజెక్ట్ చేయాలని రెండు తీర్మానాలు వచ్చిన వాటికి సమయం ఇవ్వలేదు. ముగ్గురు, నలుగురు సభ్యుల మీద దాడులు కూడా జరిపించారు. 12పార్టీల సభ్యులందరం డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చాము. ఇదే అంశంపై రేపు ఒత్తిడి తెస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏం చేయలనో దేశంలో ఎవరు చేయనంతగా మేము చేసాం.రాజ్యాంగలో వ్యవసాయం అనేది రాష్ట్రాల సబ్జెక్టు. ఏ విధంగా రైతు బంధు, రైతు భీమా, నిరంతర కరెంటు ఇస్తున్నామే అలా ఏ బిల్లుతో రాదు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించినట్లుగా దేశంలో ఏ బిల్లుతో కూడా సాధ్యం కాదు. మేము ఎప్పుడు రైతులతోనే నిలబడతం..మద్దతు ధర లేకుండా ఇప్పుడు కూడా బయటవాళ్ళు కొనుగోలుచేస్తున్నారు.మద్దతు ధర కంటే తక్కువగా పంట కొనుగోలు చేయవద్దని కేంద్రం చెప్పగలదా అని కేంద్రాన్ని కేకే ప్రశ్నించారు.

- Advertisement -