ఇది రైతులకు బ్లాక్ డే- ఎంపీ నామా

346
mp nama
- Advertisement -

జై జవాన్, జై కిసాన్ వీరిద్దరూ బాగుంటే దేశం బాగుంటది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కిందన్నారు లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపడంపై ఎంపీ నామా ఢిలీలో మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే బిల్లు వీగిపోతుందని వాయిస్ ఓటింగ్‌తో ప్రజాస్వామ్య గొంతు నొక్కారు. రాబోయే రోజుల్లో ఇదే రైతులు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ముందుకు వస్తారని నామా అన్నారు.

రైతుల బిల్లుపై పార్టీలను ఎందుకు ఏకం చేయలేకపోయారు. కనీసం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపొచ్చు.. లేదంటే రైతులను పిలిచి సమావేశం పెట్టొచ్చు.ఇంత పెద్ద అంశంపై విపక్షాలు మాట్లాడుతుంటే బుల్డోజ్ చేశారు. ఇది కచ్చితంగా రైతులకు ఒక బ్లాక్ డే గా పరిగణిస్తామన్నారు. బిల్లు ఆమోద సమయంలో సభ ప్రసారాలను నిలిపివేశారు. మీరు చేసిన అన్యాయానికి రాబోయే రోజుల్లో రైతులు బుద్ధి చెప్తారు ఎంపీ నామా ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -