భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వృత్తి రిత్యా వైద్యుడు అన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన నియోజకవర్గంలో చాలా మందికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు. తాజాగా తన వృత్తి ధర్మాన్ని పాటించి మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బాధితురాలికి స్వయంగా ప్రథమ చికిత్స చేసి వైద్యుడిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు వెళుతున్న ద్విచక్రవాహనం ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అదే సమయంలో అటు నుంచి హైదరాబాద్ నుంచి సూర్యపేట వెళుతున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు ఆపీ బాధితులను పరామర్శించి నాగమణి అనే మహిళకు అక్కడే ప్రథమ చికిత్స చేశారు. అక్కడే ఉండి ఆంబులెన్స్ ను రప్పించి నాగమణిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఓ బాధితురాలికి ఇలా చేయడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Great gesture MP/ Doctor @narsaiah Saab 👏👏 https://t.co/HMXsWj7px3
— KTR (@KTRTRS) February 9, 2019