రేవంత్…ముక్కు నేలకు రాయాలి: రాజేశ్వరరెడ్డి

335
TRS MLC Palla Rajeshwar Reddy fires on Revanth Reddy Comments
- Advertisement -

రేవంత్ రెడ్డి కి  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి  సవాల్ విసిరారు.  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు.

TRS MLC Palla Rajeshwar Reddy fires on Revanth Reddy Comments

తప్పుడు ఆరోపణలను నిరూపించలేకపోతే.. రేవంత్ రెడ్డి ముక్కును నేలకు రాయాలని సవాల్ విసిరారు. రాజీనామా డ్రామాకు రేవంత్ రెడ్డి తెరదించాలని పల్లా రాజేశ్వరి రెడ్డి ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా  రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇవ్వాలని సవాల్ విసిరారు.

   TRS MLC Palla Rajeshwar Reddy fires on Revanth Reddy Comments

అలాకాకుండా అమరావతిలో ఉండే ఏపీ సీఎంకు రాజీనామా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ లు తప్పు చేసిన విషయం అందరికీ తెలిసిందేనని..ఈ కేసులో వారు తప్పించుకోలేరని అన్నారు.  అంతేకాకుండా ఒకప్పుడు చంద్రబాబు వేసిన బొక్కలు తిని రేవంత్ కుక్కలా పనిచేశాడని రాజేశ్వరరెడ్డి  అన్నారు.

- Advertisement -