పోసానిపై సత్యారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు..

184
- Advertisement -

నంది అవార్డుల పై ప్రశ్నిస్తే అసలు నంది అవార్డులు రద్దు చేస్తామని అన్నారని.. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనని మాటలు అన్నారని… బేస్ చేసుకుంటూ తీవ్ర స్థాయిలో తెలుగుసిని పరిశ్రమ గాని,… ఆంధ్ర ప్రదేశ్ ప్రజలుగాని బాధపడే విధంగా పోసాని మాట్లాడారని.. నిర్మాత సత్యారెడ్డి, పోసాని కృష్ణమురళిపై విరుచుకుపడ్డారు. అసలు పోసాని మాట్లడిన ఆరోపణల్లో 10 ఆరోపణలు అవాస్తవాలని….. అందులోని మొదటి ఆరోపణ ఇక నుండి ప్రశ్నిస్తే.. నంది అవార్డుల ను ప్రభుత్వం రద్దు చేస్తుందని.. పోసాని అన్నారు. కానీ అలా ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నారో.. నిరూపించాలి. అలాగే దీనికి ఏపీ ఐటి శాఖామాత్యులు లోకేష్ బాబుకి ఏమి సంబంధమో చెప్పాలి. 1998 లో నంది అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇలానే నంది అవార్డులు తప్పు అని ఇదే పోసాని, గుణశేఖర్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆనాడు వార్తాపత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూడవచ్చని సత్యారెడ్డి అన్నారు. అప్పట్లోనే పోసాని నంది అవార్డులను రద్దు చెయ్యాలని.. నంది అవార్డులను కించపరిచేలా మట్లాడారని.. అలాగే ఈ అవార్డులను ఒక కులాన్ని, ఒక ప్రాంతానికి, ఒక మతానికి అంటగట్టవద్దని సత్యారెడ్డి అంటున్నారు.

Sathya Reddy Press Meet On Nandi Awards

అంతేకాదు అక్కడ ప్రత్యేక హోదా విషయంలో ఫ్లైట్స్ లో వచ్చి చలో అసెంబ్లీ అని… ధర్నాలు చేస్తామని.. రాస్తారోకోలు చేస్తామని వచ్చేవాళ్లు గురించి మాట్లాడిన మాటలను.., శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయని మాట్లాడిన మాటలకూ.. ఇక్కడ సినిమా పరిశ్రమతో ముడిపెట్టి ఆధార కార్డు ఉండాలా? ఓటర్ కార్డు ఉండాలా? ప్రశ్నించాలి అంటే.. అని పోసాని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. అలాగే ఏపీ ప్రభుత్వం చేసే మంచి పనులను పక్కనపెట్టేసి పోసాని ఇలా నంది అవార్డుల గురించి మాట్లాడడం….. అలాగే లోకేష్ బాబు గురించి మాట్లాడిన మాటలు గాని, కులాలకు సంబందించిన మాటలుగాని.. ఒక పార్టీ ఎమ్మెల్సీ గురించి మాట్లాడిన మాట్లల్లో గాని.. బిఎన్ రెడ్డి అవార్డు గురించిన బోయపాటిని అన్నమాటలు గాని, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి కి వచ్చిన అవార్డుల గురించి పోసాని అన్న మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్నామని…. సత్యారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Sathya Reddy Press Meet On Nandi Awards

పోసాని నంది అవార్డుల విషయంలో మాట్లాడిన మాటలన్నీ ఉపసంహరించుకోవాలని సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. పోసాని మాట్లాడిన మాటలకు, ఏపీ ప్రజలు చాల బాధపడుతున్నారని.. సినిమా విషయంలో జరిగిన దాన్ని గురించి ఏపి ప్రభుత్వాన్ని నిలదీసి మట్లాడడం కరెక్ట్ కాదని.. నంది అవార్డుల గురించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని.. అలాగే సినిమా పరిశ్రమలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి.. వాటి గురించి పోసాని పట్టించుకుంటే బావుంటుందని సత్యారెడ్డి ఎద్దేవా చేశారు. చిన్న నిర్మాతల సమస్యలు పట్టించుకోండి.. సినిమా రంగం గురించి ఆలోచిస్తే.. ప్రకాష్ రాజ్‌కి, జగపతి బాబు, తమ్మారెడ్డి సినిమా పరిశ్రమ మంచి గురించి మాట్లాడుతున్న మాట్లాడిన మాటలకూ మద్దతు పలకండి.. అలాగే ప్రభుత్వం గురించి మాట్లాడాలనుంటే.. బయటికి వచ్చి మాట్లాడండి అని సత్యారెడ్డి పోసాని పై ఫైర్ అయ్యారు.

Sathya Reddy Press Meet On Nandi Awards

రైటర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులన్నీ అర్హత ఉన్నవారికే ప్రకటించారని.. ఈ అవార్డుల ఎంపికతో తాను ఏకీభవిస్తున్నాని.. అలాగే నంది అవార్డులు వచ్చిన వారు సంతోష పడడం.. రాని వారు బాధపడడడం అనేది సహజమని.. ఈ ఏడాది నంది రాని వారి వచ్చే ఏడాది నంది అవార్డు గెలుచుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలానే నంది అవార్డులు సొంతం చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -